ఉద్యోగులకే తన సంస్థను ఇచ్చేసిన పెద్దాయన ఇక లేరు..

కంపెనీ లాభాలకంటే ఉద్యోగులకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చిన ‘బాబ్స్‌ రెడ్‌ మిల్‌’ వ్యవస్థాపకుడు బాబ్‌ మూర్‌ (94) ఇటీవల కన్నుమూశారు.

Published : 22 Feb 2024 04:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంపెనీ లాభాలకంటే ఉద్యోగులకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చిన ‘బాబ్స్‌ రెడ్‌ మిల్‌’ వ్యవస్థాపకుడు బాబ్‌ మూర్‌ (94) ఇటీవల కన్నుమూశారు. అమెరికాకు చెందిన బాబ్‌.. 1978లో ఈ సంస్థను నెలకొల్పి ఉన్నత స్థాయిలో నిలిపారు. 2010లో తన 81 పుట్టినరోజు సందర్భంగా నాటి 209 మంది ఉద్యోగులకు యాజమాన్య వాటాలను కేటాయించారు. అప్పటికే మూర్‌ యాజమాన్యం నుంచి వైదొలగడం గమనార్హం. ప్రస్తుతం 700 మంది ఉద్యోగులు ఉండటంతో సంస్థ పూర్తిగా ఉద్యోగుల కంపెనీగా మారిపోయింది. ఫోర్బ్స్‌ ప్రకారం.. 2018 నాటికి బాబ్స్‌ రెడ్‌ మిల్‌ ఆదాయం 100 మిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం 70 కంటే ఎక్కువ దేశాల్లో రెండువందలకి పైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఫిబ్రవరి 10న మూర్‌ కన్నుమూశారని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన మృతి పట్ల ఉద్యోగులంతా సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని