ఐఫిల్‌ టవర్‌ మళ్లీ మూసివేత

పర్యాటకులను విశేషంగా ఆకర్షించే పారిస్‌లోని ఐఫిల్‌ టవర్‌ను బుధవారం మూసివేశారు. వేతనాలను పెంచడంతో పాటు మరికొన్ని సదుపాయాలను కల్పించాలని కోరుతూ కార్మికులు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి ఎదురైంది.

Published : 22 Feb 2024 04:49 IST

 వేతనాల పెంపు కోసం కార్మికుల సమ్మె

పారిస్‌: పర్యాటకులను విశేషంగా ఆకర్షించే పారిస్‌లోని ఐఫిల్‌ టవర్‌ను బుధవారం మూసివేశారు. వేతనాలను పెంచడంతో పాటు మరికొన్ని సదుపాయాలను కల్పించాలని కోరుతూ కార్మికులు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి ఎదురైంది. గురువారం కూడా సందర్శకులకు అంతరాయాలు కలగవచ్చని టవర్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన ఓ సందేశం పేర్కొంది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. గత రెండు నెలల వ్యవధిలో ఐఫిల్‌ టవర్‌కు తాళాలు వేయాల్సిరావడం ఇది మూడోసారి. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మరిన్ని రోజులు, వారాల పాటు సమ్మె కొనసాగుతుందని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఒలింపిక్‌ క్రీడల నిర్వహణకు ఫ్రాన్స్‌ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఐఫిల్‌ టవర్‌ కార్మికులు సమ్మెకు దిగడంతో అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతోంది. ఫ్రాన్స్‌కు పర్యాటకం ద్వారా లభించే ఆదాయంలో అత్యధికం ఈ టవర్‌ ద్వారానే సమకూరుతుంది. సంవత్సరం పొడవునా ఎలాంటి సెలవు లేకుండా ఈ కట్టడం సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని