వెనెజువెలాలో బంగారుగని కూలిడజన్ల కొద్దీ కార్మికుల మృతి?

వెనెజువెలాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బంగారుగని కూలిపోయి.. డజన్లకొద్దీ కార్మికులు అందులో చిక్కుకుపోయారు.

Published : 22 Feb 2024 04:50 IST

లా పరాగ్వా: వెనెజువెలాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బంగారుగని కూలిపోయి.. డజన్లకొద్దీ కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వీరిలో చాలామంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. అంగోస్తురా మున్సిపాలిటీలోని బులాలోకా గని వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గంటసేపు బోటులో ప్రయాణిస్తేకానీ అధికారులు అక్కడికి చేరుకోవడం కష్టం. సహాయక సామగ్రితో సిబ్బంది అక్కడికి వెళుతున్నట్లు అంగోస్తురా మేయర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు