యుద్ధం ఆపండని ఇజ్రాయెల్‌కు చెప్పొద్దు

అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నిలిచింది. ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదంపై గత మూడు రోజులుగా ఐసీజేలో జరుగుతున్న విచారణలో బుధవారం అమెరికా తన వాదనలు వినిపించింది.

Published : 22 Feb 2024 04:50 IST

ఐసీజేలో అమెరికా వాదనలు

ది హేగ్‌: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నిలిచింది. ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదంపై గత మూడు రోజులుగా ఐసీజేలో జరుగుతున్న విచారణలో బుధవారం అమెరికా తన వాదనలు వినిపించింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ అంశంలో ఒక పక్షంపైనే దృష్టి కేంద్రీకరించడం సరికాదని తెలిపింది. అంతేకాదు... బేషరతుగా యుద్ధం ఆపాలని, బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు ఆదేశాలివ్వొద్దని కూడా అమెరికా ప్రతినిధి రిచర్డ్‌.. 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని