లాటరీలో రూ.796 కోట్ల జాక్‌పాట్‌

పదో, ఇరవై కోట్లో కాదు.. ఏకంగా రూ.796 కోట్ల జాక్‌పాట్‌ కొట్టేశాడు చైనాలోని గోయ్‌జో ప్రావిన్సుకు చెందిన వ్యాపారవేత్త.

Published : 22 Feb 2024 04:52 IST

 చైనా వ్యాపారవేత్త అదృష్టం

బీజింగ్‌: పదో, ఇరవై కోట్లో కాదు.. ఏకంగా రూ.796 కోట్ల జాక్‌పాట్‌ కొట్టేశాడు చైనాలోని గోయ్‌జో ప్రావిన్సుకు చెందిన వ్యాపారవేత్త. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నిర్వహించే లాటరీలో గెలుచుకున్నాడు. మొత్తం 133 టికెట్లు కొన్నాడు. ఒక్కో టికెట్‌ ఖరీదు రెండు యువాన్లు (సుమారు రూ.24 రూపాయలు). ఈ టికెట్లకే ఆయనకు 680 మిలియన్‌ యువానులు (రూ.796 కోట్లు) లభించాయి. ‘‘ముందు నేను నమ్మలేదు. ఒకటికి పది సార్లు నెగ్గానన్న విషయాన్ని రూఢీ చేసుకున్నాను. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు’’ అని ఆ వ్యక్తి పేర్కొన్నారు. విజేత పేరును నిర్వాహకులు వెల్లడించలేదు. చైనా ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఆ వ్యాపారవేత్త తాను నెగ్గిన సొమ్ములో ఐదో వంతు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని