అంతరిక్షంలో మా అణ్వస్త్రాలు లేవు: పుతిన్‌

అంతరిక్షంలో అణ్వాయుధాలను ప్రవేశపెట్టే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. అమెరికా అంతరిక్ష సామర్థ్యానికి సరితూగే ఆయుధ పాటవాన్ని మాత్రమే తాము కలిగి ఉన్నామని వివరించారు.

Updated : 22 Feb 2024 06:16 IST

మాస్కో: అంతరిక్షంలో అణ్వాయుధాలను ప్రవేశపెట్టే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. అమెరికా అంతరిక్ష సామర్థ్యానికి సరితూగే ఆయుధ పాటవాన్ని మాత్రమే తాము కలిగి ఉన్నామని వివరించారు. రష్యా ఆందోళనకరమైన ఉపగ్రహ విధ్వంస సామర్థ్యాన్ని సంతరించుకుందని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం గతవారం ప్రకటించడంతో కలకలం రేగింది. ఉపగ్రహ విధ్వంస ఆయుధం ఇంకా కార్యశీలం కాలేదనీ వివరించింది. దానికి అణ్వస్త్ర సామర్థ్యం ఉందా అనేది అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ కర్బీ వెల్లడించకపోయినా, రష్యా చర్య బాహ్య అంతరిక్ష ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రకటించారు. ఈ సమస్య మీద రష్యాతో నేరుగా చర్చలు జరుపుతామని శ్వేత సౌధం ప్రకటించింది. కాగా, ఉక్రెయిన్‌కు ఆర్థిక, ఆయుధ సహాయం చేయడానికి ఉద్దేశించిన బిల్లు అమెరికా పార్లమెంటులో నిలిచిపోయిందని, దాన్ని నెగ్గించుకోవడానికే అమెరికా ప్రభుత్వం తమను బూచిగా చూపుతోందని రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు