సిరియాపైకి ఇజ్రాయెల్‌ క్షిపణులు

ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరు విస్తరిస్తోంది. బుధవారం ఉదయం ఇజ్రాయెల్‌ క్షిపణులు ఏకంగా సిరియా రాజధాని డమాస్కస్‌పై విరుచుకుపడ్డాయి.

Published : 22 Feb 2024 04:54 IST

డమాస్కస్‌ : ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరు విస్తరిస్తోంది. బుధవారం ఉదయం ఇజ్రాయెల్‌ క్షిపణులు ఏకంగా సిరియా రాజధాని డమాస్కస్‌పై విరుచుకుపడ్డాయి. ఓ ఇరానియన్‌ పాఠశాల సమీపంలోని అపార్టుమెంటు లక్ష్యంగా దూసుకెళ్లాయి. 10 అంతస్తుల ఈ భవనంలో నాలుగో అంతస్తు దెబ్బతింది. దాడిలో ఇద్దరు మృతి చెందారని, ఆస్తినష్టం సంభవించిందని సిరియా జాతీయ టెలివిజన్‌ పేర్కొంది. గోలన్‌హైట్స్‌ నుంచి ఈ క్షిపణులు వచ్చినట్లు తెలిపింది. దాడిని ఇజ్రాయెల్‌ ధ్రువీకరించలేదు. 

గాజాలో మరో 67 మంది మృతి

గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి జరిగిన దాడుల్లో 67 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగ అధికారులు తెలిపారు.  రఫా నగరంపైనా దాడులు జరిగాయని, ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని