చంద్రుడి సమీప కక్ష్యలోకి అమెరికా ప్రైవేటు ల్యాండర్‌

అమెరికాకు చెందిన ప్రైవేటు ల్యాండర్‌ బుధవారం చంద్రుడి సమీప కక్ష్యలోకి ప్రవేశించింది. త్వరలో ఇది చంద్రుడిపై దిగనుంది.

Published : 22 Feb 2024 05:00 IST

కేప్‌ కెనవెరాల్‌: అమెరికాకు చెందిన ప్రైవేటు ల్యాండర్‌ బుధవారం చంద్రుడి సమీప కక్ష్యలోకి ప్రవేశించింది. త్వరలో ఇది చంద్రుడిపై దిగనుంది. 1972లో అపోలో మిషన్‌ తర్వాత నాసా చేపట్టిన చంద్ర మండల యాత్ర ఇదే కావడం గమనార్హం. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒక ప్రైవేటు సంస్థ చంద్ర మండల యాత్రను తొలిసారిగా దిగ్విజయంగా చేపట్టినట్లవుతుంది. గతవారం ఇంట్యూటివ్‌ మెషీన్స్‌కు చెందిన ఒడిస్సస్‌ ల్యాండర్‌ను ప్రయోగించారు. ఇది బుధవారం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని