పర్యాటక వీసాల నిరీక్షణ కాలాన్ని తగ్గిస్తాం

భారతీయులకు పర్యాటక వీసాల (బీ1, బీ2) జారీ ప్రక్రియలో ప్రస్తుత నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని యూఎస్‌ బ్యూరో కాన్సులర్‌ వ్యవహారాల సహాయ కార్యదర్శి రీనా బిట్టర్‌ తెలిపారు.

Published : 23 Feb 2024 03:58 IST

అమెరికా వెల్లడి

దిల్లీ: భారతీయులకు పర్యాటక వీసాల (బీ1, బీ2) జారీ ప్రక్రియలో ప్రస్తుత నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని యూఎస్‌ బ్యూరో కాన్సులర్‌ వ్యవహారాల సహాయ కార్యదర్శి రీనా బిట్టర్‌ తెలిపారు. ఈ వీసాకు వేచి ఉండే సమయం గతం కంటే 75 శాతం తగ్గిందని.. భవిష్యత్తులో ఇది మరింత మెరుగ్గా మారుతుందని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారతీయులు అమెరికాను సందర్శించే అవకాశం కలుగుతోందని తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘గత ఏడాది 14 లక్షల వీసా దరఖాస్తులను పరిష్కరించాం. ప్రస్తుతం పర్యాటక వీసాల్లో తప్పించి మిగిలిన వాటిలో వేచి ఉండే సమయం దాదాపుగా లేదు. 2022-23లో 2,68,923 మంది భారతీయ విద్యార్థులకు వీసాలిచ్చాం’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని