వంధ్యత్వంతో క్యాన్సర్‌ ముప్పు

వంధ్యత్వంతో బాధపడుతున్న పురుషులతో పాటు వారి కుటుంబాలు వివిధ క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం అధికమని అమెరికాలో పరిశోధకులు కనుగొన్నారు.

Published : 23 Feb 2024 03:58 IST

దిల్లీ: వంధ్యత్వంతో బాధపడుతున్న పురుషులతో పాటు వారి కుటుంబాలు వివిధ క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం అధికమని అమెరికాలో పరిశోధకులు కనుగొన్నారు. అసలు వీర్యకణాలే ఉత్పత్తి కాని పురుషులనూ, చాలా తక్కువ వీర్యాన్ని ఉత్పన్నం చేసే పురుషులనూ వీరు పరిశీలించారు. వీర్యం బొత్తిగా ఉత్పన్నం కాకపోతే ఎజూ స్పెర్మియా అంటారు. ఇలాంటి పురుషుల కుటుంబాల్లో ఎముకలు, కీళ్ల క్యాన్సర్‌ ప్రమాదం 156 శాతం ఎక్కువ. వీరిలో లింఫ్‌, మృదు కణజాల, థైరాయిడ్‌ క్యాన్సర్ల ప్రమాదం వరుసగా 60, 56, 54 శాతం పెరుగుతుంది. మిల్లీమీటరు వీర్యంలో 15 లక్షలకన్నా తక్కువ వీర్యకణాలుంటే ఎముకలు, కీళ్ల క్యాన్సర్‌ ప్రమాదం 143 శాతం, వృషణ క్యాన్సర్‌ ప్రమాదం 134 శాతం ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని