అఫ్గానిస్థాన్‌లో బహిరంగ మరణశిక్ష

అఫ్గానిస్థాన్‌ ఆగ్నేయ ప్రాంతంలోని ఘాజ్నీ పట్టణంలో ఇద్దరు దోషులకు తాలిబన్లు బహిరంగ మరణ శిక్ష విధించారు. ఓ స్టేడియంలో గురువారం దోషులను తుపాకులతో కాల్చి శిక్ష అమలు చేశారు.

Published : 23 Feb 2024 04:40 IST

ఘాజ్నీ: అఫ్గానిస్థాన్‌ ఆగ్నేయ ప్రాంతంలోని ఘాజ్నీ పట్టణంలో ఇద్దరు దోషులకు తాలిబన్లు బహిరంగ మరణ శిక్ష విధించారు. ఓ స్టేడియంలో గురువారం దోషులను తుపాకులతో కాల్చి శిక్ష అమలు చేశారు. అనంతరం మృత దేహాలను తరలించారు. ఈ శిక్షను కొన్ని వేల మంది చూశారు. దోషుల నేరాలకు సంబంధించి సమాచారం కోరగా తాలిబన్లు స్పందించలేదు. శిక్ష అమలు సమయంలో దోషులను క్షమించాలని మత పండితులు బాధితుల బంధువులను వేడుకోగా వారు నిరాకరించారు. ఇద్దరిని చంపిన కేసులో దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని