పుతిన్‌ లాంటి అధ్యక్షులతో అణుయుద్ధం ముప్పు: బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి నోరు జారారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అసభ్య పదజాలంతో దూషించారు.

Updated : 23 Feb 2024 06:15 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి నోరు జారారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన వల్ల అణుయుద్ధం రూపంలో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పుతిన్‌ లాంటి వెర్రి వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నంతకాలం అణుయుద్ధం గురించి ఆందోళన చెందాల్సిందే. అలాంటి వ్యక్తులతో మానవాళి మనుగడకు ప్రమాదం. శుక్రవారం నుంచి రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం’’ అని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటినుంచి పుతిన్‌ విధానాలను బైడెన్‌ తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు. ఆయనను యుద్ధ నేరస్థుడిగా పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని