మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక

భారత్‌తో దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ చైనా అధునాతన పరిశోధక నౌక ‘షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03’ గురువారం మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది.

Updated : 23 Feb 2024 14:21 IST

భారత నౌకాదళం అభ్యంతరం

మాలె: భారత్‌తో దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ చైనా అధునాతన పరిశోధక నౌక ‘షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03’ గురువారం మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. భారత్‌, శ్రీలంక, మాల్దీవులు కలిసి ‘దోస్తీ-16’ పేరుతో త్రైపాక్షిక విన్యాసాలు చేయడానికి సిద్ధమైన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. రాజధాని మాలె తీరంలో ఇది లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిందూ మహాసముద్రంలో పరిశోధనల పేరిట వచ్చిన ఈ నౌక ద్వారా ఇక్కడి సముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి మార్గాలను గుర్తించే అవకాశం చైనాకు లభిస్తుందని భారత నౌకాదళ వర్గాలు అభిప్రాయం వ్యక్తంచేశాయి. ఇప్పటికే శ్రీలంక వెళ్లిన ఈ తరహా నౌకలు వాటి కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. దానిపై భారత్‌ ఆందోళన వ్యక్తంచేసింది. మాల్దీవులతో దౌత్య ఉద్రిక్తతల వేళ.. హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధక నౌక కదలికల్ని భారత్‌ నిశితంగా గమనిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని