తూచ్‌.. రిగ్గింగ్‌ జరగలేదు

పాకిస్థాన్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన రావల్పిండి ఎన్నికల అధికారి లియాఖత్‌ అలీ మాట మార్చారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ తనకు పదవి ఆశ చూపడంతో తప్పుడు ఆరోపణలు చేశానని పేర్కొన్నారు.

Published : 23 Feb 2024 04:41 IST

మాట మార్చిన పాక్‌ ఎన్నికల అధికారి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన రావల్పిండి ఎన్నికల అధికారి లియాఖత్‌ అలీ మాట మార్చారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ తనకు పదవి ఆశ చూపడంతో తప్పుడు ఆరోపణలు చేశానని పేర్కొన్నారు. రావల్పిండిలో 13 మంది ఎంపీల ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానని లియాఖత్‌ గత శనివారం ప్రకటించారు. ఆయన మీడియా సమావేశంలో ఉండగానే పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. గురువారం ఆయన మాట మార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని