వంతెనను ఢీకొన్న నౌక.. నదిలో పడిన వాహనాలు

చైనాలో అనూహ్యరీతిలో నదిపై వంతెనను కంటైనర్ల నౌక ఢీకొంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో వంతెన రెండు ముక్కలుగా విడిపోయింది.

Published : 23 Feb 2024 04:42 IST

చైనాలో అయిదుగురి మృతి

బీజింగ్‌: చైనాలో అనూహ్యరీతిలో నదిపై వంతెనను కంటైనర్ల నౌక ఢీకొంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో వంతెన రెండు ముక్కలుగా విడిపోయింది. అదే సమయంలో దానిపై వెళ్తున్న అయిదు వాహనాల్లో రెండు నదిలో, మూడు నేరుగా నౌకపై పడ్డాయి. అయిదుగురు మృతిచెందారు. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఖాళీ కంటైనర్లతో కూడిన నౌక- ఫోష్‌మన్‌ నుంచి గ్వాంగ్జూ వైపు వెళ్తున్నన్నప్పుడు వంతెనను బలంగా ఢీకొంది. ఆ సమయంలో వంతెనపై వాహనాల రద్దీ తక్కువగా ఉంది. ప్రమాదం అనంతరం వంతెన స్తంభాల మధ్యే ఈ నౌక చిక్కుకుపోయింది. నదిలో పడిపోయిన బస్సులో డ్రైవర్‌ మాత్రమే ఉన్నారు. ప్రమాద మృతుల్లో ఆయనొకరు. నౌక కెప్టెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ వంతెనను నౌకలు ఢీకొనే ముప్పు ఉండటంతో నిర్మాణంలో మార్పులు చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని