ఐరాసలో సంస్కరణలకు వాళ్లే వ్యతిరేకం

సమకాలీన ప్రపంచంలోని అనేక సమస్యలకు పాశ్చాత్య కూటమే కారణమని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ ఆరోపించారు.

Published : 23 Feb 2024 04:42 IST

చైనాపై మండిపడ్డ జైశంకర్‌

దిల్లీ: సమకాలీన ప్రపంచంలోని అనేక సమస్యలకు పాశ్చాత్య కూటమే కారణమని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ ఆరోపించారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి దిల్లీలో జరిగిన వార్షిక సదస్సులో (రైసినా డైలాగ్‌) మాట్లాడిన ఆయన.. చైనా తీరును పరోక్షంగా దుయ్యబట్టారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలకు అడ్డుగోడగా బీజింగ్‌ నిలుస్తోందని విమర్శించారు. రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో పాతుకుపోయిన అంతర్జాతీయ వ్యవస్థతో ప్రపంచం ముందుకు సాగలేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని