‘హైపోథెర్మియా’ వల్లే అమెరికాలో భారత సంతతి విద్యార్థి మృతి

అమెరికాలో గత నెల అనుమానాస్పద రీతిలో మృతిచెందిన భారత సంతతి విద్యార్థి అకుల్‌ ధావన్‌ మృతికి గల కారణాన్ని ఇల్లినాయ్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది.

Published : 24 Feb 2024 03:26 IST

వాషింగ్టన్‌: అమెరికాలో గత నెల అనుమానాస్పద రీతిలో మృతిచెందిన భారత సంతతి విద్యార్థి అకుల్‌ ధావన్‌ మృతికి గల కారణాన్ని ఇల్లినాయ్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. మద్యాన్ని అధిక మోతాదులో తీసుకోవడం, గడ్డకట్టే చలిలో ఎక్కవసేపు ఉండడం వల్ల తలెత్తిన హైపోథెర్మియాతోనే అతడు మృతి చెందినట్లు ఇల్లినాయ్‌ విశ్వవిద్యాలయ కార్యాలయం ప్రాథమికంగా ధ్రువీకరించింది. దీనిపై లోతైన విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. జనవరి 19న మద్యం తాగిన అనంతరం అకుల్‌ తన మిత్రులతో కలిసి క్యాంపస్‌కు సమీపంలోని ఓ క్లబ్‌కు వెళ్లాడు. కొద్దిసేపటికి అక్కడినుంచి వెళ్లిపోయిన తన మిత్రులు తిరిగి వచ్చేటప్పటికి అకుల్‌ మరింత మద్యం సేవించినట్లు సెక్యూరిటీ కెమెరాల దృశ్యాల ద్వారా తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం బయటకు వచ్చిన అకుల్‌ అనేకసార్లు తిరిగి క్లబ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా.. సెక్యూరిటీ అనుమతించలేదు. క్యాబ్‌లు బుక్‌ చేసినా.. అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించాడు. ఎంతకీ సెక్యూరిటీ అనుమతించకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. తర్వాత మిత్రులు అతణ్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో పోలీసులను ఆశ్రయించారు. వెంటనే గాలింపు చేపట్టిన పోలీసులు.. కొన్ని గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని