నావల్నీ కుటుంబాన్ని పరామర్శించిన బైడెన్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Published : 24 Feb 2024 04:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పరామర్శించారు. కాలిఫోర్నియాలోని ఒక హోటల్‌లో నావల్నీ సతీమణి యులియా, కుమార్తె దాశా..బైడెన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఓదార్చారు. ఈ సమావేశం గురించి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘నావల్నీ మృతి వారికి తీరని లోటు. ఆయన ధైర్యం వారిలో కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. తన కుమారుడి మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని రష్యా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని నావల్నీ తల్లి ల్యూడ్మిలా వాపోయారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘ఎలాంటి అంతిమయాత్ర లేకుండా అంతా రహస్యంగా జరగాలని అధికారులు చెబుతున్నారు’’ అని అందులో ఆరోపించారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తన కుమారుడిని కడసారి చూసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె ఇప్పటికే అధ్యక్షుడు పుతిన్‌ను వేడుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని