స్పెయిన్‌లో అగ్నిప్రమాదం

స్పెయిన్‌లోని వాలెన్సీయా నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెండు బహుళ అంతస్తుల నివాస భవనాలు మంటల్లో చిక్కుకుపోయిన ఘటనలో నలుగురు మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి.

Published : 24 Feb 2024 04:12 IST

నలుగురి మృతి.. 14 మంది గల్లంతు

మాద్రీద్‌: స్పెయిన్‌లోని వాలెన్సీయా నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెండు బహుళ అంతస్తుల నివాస భవనాలు మంటల్లో చిక్కుకుపోయిన ఘటనలో నలుగురు మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. వారిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. మరో 14 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది క్రేన్ల సాయంతో పలువురిని రక్షించారు. తొలుత ఓ భవనంలో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో దానికి వ్యాపించినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణాలు, భవంతుల్లో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని