భారత్‌లో పర్యటించనున్న అమెరికా వర్సిటీల ప్రతినిధులు

భారత్‌తో సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికాలోని టాప్‌-17 యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధి బృందాలు వచ్చేవారం భారత్‌లో పర్యటించనున్నాయి.

Published : 24 Feb 2024 04:13 IST

వాషింగ్టన్‌: భారత్‌తో సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికాలోని టాప్‌-17 యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధి బృందాలు వచ్చేవారం భారత్‌లో పర్యటించనున్నాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ నగరాల్లో ఉన్న 26 విద్యాసంస్థల్లో అమెరికా యూనివర్సిటీల ప్రోవొస్టులు(చీఫ్‌ అకాడమిక్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ ది యూనివర్సిటీ), డీన్‌లు, ఇతర ఉన్నతాధికారులు పర్యటించనున్నారు. ఇటీవల అమెరికాలో భారత విద్యార్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌(ఐఐఈ) నేతృత్వంలో ఈనెల 25 నుంచి మార్చి 2 వరకు ఈ పర్యటన జరగనుంది. అధికారులు పర్యటించే జాబితాలో.. ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, ఐఐటీ హైదరాబాద్‌, మహీంద్ర యూనివర్సిటీ, నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెనేజ్‌మెంట్‌ స్టడీస్‌ మొదలైన విద్యాసంస్థలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని