నావల్నీ అంత్యక్రియలకూ అడ్డంకులు

కొన్నిరోజుల క్రితం జైల్లో అనుమానాస్పద రీతిలో మరణించిన రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ అంత్యక్రియలను రాజధాని మాస్కోలోని ఓ చర్చి సమీపంలో శుక్రవారం నిర్వహించనున్నారు.

Published : 29 Feb 2024 04:20 IST

హాజరయ్యేవారిని అరెస్టు చేస్తారేమో..!
యూరోపియన్‌ పార్లమెంటులో ఆయన సతీమణి యులియా ఆవేదన

మాస్కో: కొన్నిరోజుల క్రితం జైల్లో అనుమానాస్పద రీతిలో మరణించిన రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ అంత్యక్రియలను రాజధాని మాస్కోలోని ఓ చర్చి సమీపంలో శుక్రవారం నిర్వహించనున్నారు. అధ్యక్షుడు పుతిన్‌ ఫెడరల్‌ అసెంబ్లీలో గురువారం ప్రసంగించనున్న నేపథ్యంలో అదే రోజున నావల్నీ అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత నిర్ణయించామని, అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్మశాన వాటికల నిర్వాహకులు అంతిమ సంస్కారాల నిర్వహణకు ముందుకు రాలేదని ఆయన ప్రతినిధులు తెలిపారు. ఇందుకు ప్రభుత్వ ఒత్తిడే కారణమని ఆరోపించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు నావల్నీ సతీమణి యులియా నవాల్నయ బుధవారం యురోపియన్‌ పార్లమెంటులో ప్రసంగించారు. తన భర్త అంత్యక్రియలు శాంతియుతంగా జరగకుండా పోలీసులు అడ్డుకోవచ్చని, హాజరయ్యే వారిని అరెస్టు కూడా చేయొచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనకు అడ్డుగా ఉన్నవారిని ఏమైనా చేయడానికైనా పుతిన్‌ వెనుకాడడని, అందుకు తన భర్త మరణమే నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. పుతిన్‌ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే కొత్త ఆంక్షలు విధిస్తే సరిపోదని, వృవస్థీకృత నేర విధానాలపై గట్టిగా పోరాడాలని చట్ట సభ్యులను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు