పాక్‌ ప్రధానిగా మళ్లీ షెహబాజ్‌

ఆర్థికసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ (72) మరోమారు బాధ్యతలు చేపట్టనున్నారు.

Published : 29 Feb 2024 04:21 IST

ప్రతిపాదించిన నవాజ్‌ షరీఫ్‌

లాహోర్‌: ఆర్థికసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ (72) మరోమారు బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ - నవాజ్‌  (పీఎంఎల్‌-ఎన్‌) పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ (74) సంకీర్ణ ప్రభుత్వ సారథిగా తన సోదరుడైన షెహబాజ్‌ పేరును లాంఛనంగా ప్రతిపాదించారు. గత ఏడాది ఆగస్టు దాకా 16 నెలలపాటు షెహబాజ్‌ సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు