సోవియట్‌ మాజీ ప్రధాని రిజ్‌కోవ్‌ కన్నుమూత

ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌కు ప్రధానిగా పని చేసిన నికోలయ్‌ రిజ్‌కోవ్‌ (94) కన్నుమూశారు.

Published : 29 Feb 2024 04:22 IST

మాస్కో: ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌కు ప్రధానిగా పని చేసిన నికోలయ్‌ రిజ్‌కోవ్‌ (94) కన్నుమూశారు. సోవియట్‌ యూనియన్‌ ఆర్థికంగా పతనమవుతున్నప్పుడు దానిని అడ్డుకోవడానికి రిజ్‌కోవ్‌ ఎంతగానో ప్రయత్నించారు. మిఖాయిల్‌ గోర్బచెవ్‌ దేశాధినేతగా ఉన్నప్పుడు ఆరేళ్లపాటు ఆయన ప్రధానిగా పని చేశారు. గోర్బచెవ్‌ సంస్కరణలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక, రాజకీయ వాతావరణాన్ని మార్చేందుకు వారు ఎన్నో చర్యలు తీసుకున్నా 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు