ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై దాడి

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై మంగళవారం లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్లు క్షిపణి దాడులు చేశారు. దాదాపు 20 క్షిపణులను హెజ్‌బొల్లా ప్రయోగించింది.

Published : 29 Feb 2024 04:17 IST

20 క్షిపణులను ప్రయోగించిన హెజ్‌బొల్లా
కూల్చేశామని ఇజ్రాయెల్‌ వెల్లడి

జెరూసలెం: ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై మంగళవారం లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్లు క్షిపణి దాడులు చేశారు. దాదాపు 20 క్షిపణులను హెజ్‌బొల్లా ప్రయోగించింది. అందులో ఒకటి వైమానిక నిర్వహణ వ్యవస్థకు సమీపంలో పడింది. మిగిలిన వాటిలో కొన్నింటిని కూల్చేశామని, మరి కొన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడ్డాయని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ప్రతిగా లెబనాన్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశామని వెల్లడించింది. తాము ఇజ్రాయెల్‌లోని మెరోన్‌ వైమానిక నిర్వహణ వ్యవస్థపై క్షిపణితో దాడి చేశామని హెజ్‌బొల్లా ప్రకటించింది. మరో దాడితో సాంకేతిక పరికరాలను ధ్వంసం చేశామని తెలిపింది. యెమెన్‌ తీరం సమీపంలోని ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌకపై మంగళవారం రాత్రి హూతీ రెబల్స్‌ దాడి చేశారు. హొడైడా తీరానికి 110 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని బ్రిటన్‌ సైన్యం వెల్లడించింది. అయితే నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని, తదుపరి గమ్యానికి అది వెళ్తోందని తెలిపింది. మరోవైపు మంగళవారం రాత్రి హూతీ రెబల్స్‌ ప్రయోగించిన 5 డ్రోన్లను కూల్చి వేశామని అమెరికా సైన్యం సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. యెమెన్‌ నుంచి ఈ డ్రోన్లు వచ్చాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని