కొవ్వుతో మెదడుపైనా దుష్ప్రభావం

పొత్తికడుపులో కొవ్వు పేరుకుంటే అది మెదడుపైన, గ్రహణ శక్తిపైనా దుష్ప్రభావం చూపుతుంది. ఈ ప్రమాదం మహిళల కన్నా నడివయసు పురుషులకే ఎక్కువ.

Updated : 29 Feb 2024 08:37 IST

దిల్లీ: పొత్తికడుపులో కొవ్వు పేరుకుంటే అది మెదడుపైన, గ్రహణ శక్తిపైనా దుష్ప్రభావం చూపుతుంది. ఈ ప్రమాదం మహిళల కన్నా నడివయసు పురుషులకే ఎక్కువ. ముఖ్యంగా కుటుంబంలో అల్జీమర్స్‌ వ్యాధి ఉన్న పురుషులకు ఈ కొవ్వు వల్ల నష్టం అధికంగా ఉంటుంది. కాలేయం, ఉదరం, క్లోమగ్రంథి చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది మెదడు పరిమాణం కుంచించుకుపోవడానికి కారణమవుతుంది. అల్జీమర్స్‌ వ్యాధి వల్ల చిత్తభ్రంశం చెందినవారి సంతానాన్ని పరిశీలించగా ఈ సంగతి తేలింది. వారంతా ఆరోగ్యంగా ఉన్న నడివయసు పురుషులే. వారి పొత్తికడుపులోని కొవ్వును ఎంఆర్‌ఐ ద్వారా పరీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని