బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 46 మంది మృతి

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెయిలీ రోడ్డులో రెస్టారెంట్లు, దుకాణాలకు నెలవైన ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 46 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 02 Mar 2024 05:13 IST

22 మందికి తీవ్రగాయాలు

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెయిలీ రోడ్డులో రెస్టారెంట్లు, దుకాణాలకు నెలవైన ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది గాయపడినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. భవనం మొదటి అంతస్తులోని ఓ రెస్టారెంటులో గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే మంటలు మొదలై అగ్నికీలలు పైఅంతస్తులకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. మంటల్లో సజీవ దహనమై కొందరు, దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు, ప్రాణభయంతో భవనం పై నుంచి దూకి ఇంకొందరు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని