చందమామపై నిద్రాణ స్థితిలోకి అమెరికా ల్యాండర్‌

చందమామపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ల్యాండర్‌ ‘ఒడిసియస్‌’.. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది.

Updated : 02 Mar 2024 04:58 IST

కేప్‌ కెనావెరాల్‌: చందమామపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ల్యాండర్‌ ‘ఒడిసియస్‌’.. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా అక్కడ రాత్రివేళ కావడంతో బ్యాటరీల ఛార్జింగ్‌కు సౌరశక్తి అందుబాటులో ఉండదు. దీనికితోడు తీవ్ర శీతల వాతావరణం నెలకొంటుంది. దీంతో ఇంజినీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యోమనౌక.. దాదాపు వారం కిందట చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో దిగిన సంగతి తెలిసిందే. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడితే రెండు నుంచి మూడు వారాల తర్వాత ఈ వ్యోమనౌక మళ్లీ క్రియాశీలమవుతుంది. ల్యాండింగ్‌ సమయంలో ఒడిసియస్‌ కాలు విరగడంతో అది ఒకపక్కకు ఒరిగిపోయింది. దీంతో సౌరశక్తి లభ్యత, కమ్యూనికేషన్‌లో ఇబ్బందులు తలెత్తాయి. అయినా ఈ వ్యోమనౌక తమ అంచనాలకు మించి పనిచేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ అనే సంస్థ దీన్ని రూపొందించింది. చందమామపై దిగిన తొలి ప్రైవేటు వ్యోమనౌక ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని