పోలీసు పహారా నడుమ నావల్నీ అంత్యక్రియలు

జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన రష్యా విపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ అంత్యక్రియలు శుక్రవారం మాస్కోలో ముగిశాయి.

Updated : 02 Mar 2024 06:13 IST

మాస్కో: జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన రష్యా విపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ అంత్యక్రియలు శుక్రవారం మాస్కోలో ముగిశాయి. భారీ పోలీసు పహారా నడుమ నిర్వహించిన అంత్యక్రియలకు వేల మంది హాజరయ్యారు. తమ అభిమాన నాయకుడికి తుది వీడ్కోలు పలికారు. మారినో డిస్ట్రిక్ట్‌లోని ఓ చర్చిలో నావల్నీ భౌతికకాయాన్ని ఉంచగా.. నివాళులు అర్పించేందుకు పాశ్చాత్య దేశాల దౌత్యవేత్తలు భారీగా క్యూ కట్టారు. అనంతరం అక్కడికి సమీపంలోని బోరిసోవ్‌స్కోయ్‌ శ్మశానవాటికలో ఖనన ప్రక్రియను పూర్తిచేశారు. గత నెల 16న నావల్నీ మరణించిన సంగతి తెలిసిందే. మరోవైపు- నావల్నీ భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు తొలుత వాహన చోదకులెవరూ ముందుకు రాలేదని ఆయన బృంద ప్రతినిధి కీరా యార్మిష్‌ తెలిపారు. కొందరు డ్రైవర్లు సంసిద్ధత వ్యక్తం చేయగా.. వారికి బెదిరింపు ఫోన్లు వచ్చాయని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని