Xi Jinping: ‘మనది బలమైన బంధం’.. పాకిస్థాన్‌ కొత్త అధ్యక్షుడికి జిన్‌పింగ్‌ అభినందనలు

Xi Jinping: పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అసిఫ్ అలీ జర్దారీకి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 10 Mar 2024 18:56 IST

బీజింగ్‌: పాకిస్థాన్‌ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(PPP) సహ ఛైర్మన్‌ ఆసిఫ్‌ అలీ జర్దారీ (Asif Ali Zardari) ఎన్నిక కావడంపై చైనా హర్షం వ్యక్తం చేసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) జర్దారీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉందన్నారు.

‘‘చైనా, పాకిస్థాన్‌ రెండు బలమైన మిత్ర దేశాలు. తమ దేశాల ప్రయోజనాలు, సమస్యలపై ఒకరికొకరు తోడుగా నిలిచారు. చైనా- పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (CPEC) నిర్మాణంలో మెరుగైన ఫలితాల్ని సాధించాం. ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరాయి’’ అని జిన్‌పింగ్‌ అన్నారు. ఇరు దేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు జర్దారీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తాజాగా పాక్‌ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్‌ షరీఫ్‌కు జిన్‌పింగ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని