హూతీల వద్ద హైపర్‌సోనిక్‌ క్షిపణులు!

వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారుల వద్ద అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణులూ  ఉన్నాయంటూ రష్యా అధికారిక మీడియా సంచలన విషయాన్ని బయటపెట్టింది.

Updated : 15 Mar 2024 05:57 IST

దుబాయ్‌: వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారుల వద్ద అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణులూ  ఉన్నాయంటూ రష్యా అధికారిక మీడియా సంచలన విషయాన్ని బయటపెట్టింది. శత్రువులు ఊహించని ఆయుధాలు తమవద్ద ఉన్నాయంటూ హూతీలు ప్రకటనలు చేస్తోన్న వేళ.. ఈ కథనం ప్రాధాన్యం సంతరించుకుంది. దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘హూతీల క్షిపణి బలగాలు ఇటీవల ‘మాక్‌ 8’ వేగానికి చేరుకోగల మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించాయి. ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో నౌకలతోపాటు ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై దాడులకు గానూ వాటి తయారీని ప్రారంభించాలని భావిస్తున్నాయి’’ అని సదరు వర్గాలతో సంబంధం ఉన్న ఓ సైనికాధికారిని ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని