ఆ తండ్రికి రూ.వందల కోట్ల ఆస్తి.. సామాన్యుడిలా పెరిగిన కుమారుడు

మనిషి సాధారణ వ్యక్తిగా పెరిగితేనే జీవితంలో విజయం సాధించడం కోసం కష్టపడి పనిచేస్తాడనేది జాంగ్‌ యుడాంగ్‌ అభిప్రాయం.

Published : 27 Mar 2024 03:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషి సాధారణ వ్యక్తిగా పెరిగితేనే జీవితంలో విజయం సాధించడం కోసం కష్టపడి పనిచేస్తాడనేది జాంగ్‌ యుడాంగ్‌ అభిప్రాయం. చైనాలో ప్రముఖ చిరుతిండ్ల బ్రాండ్‌ ‘మాలా ప్రిన్స్‌’ వ్యవస్థాకుడు ఈయన. ఏటా రూ.690 కోట్ల వ్యాపార టర్నోవరు గల యుడాంగ్‌.. తనకున్న రూ.వందల కోట్ల ఆస్తుల విషయం కుమారుడు జాంగ్‌ జిలాంగ్‌కు తెలియకుండా దాచారు. అతడికి 20 ఏళ్లు వచ్చాకే తమ సంపద గురించి తండ్రి వెల్లడించారు. దీనిపై జాంగ్‌ జిలాంగ్‌ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..‘‘నాన్న స్థాపించిన బ్రాండ్‌ గురించి తెలిసినప్పటికీ, వ్యాపారం అప్పుల్లో ఉందని తరచూ చెప్పేవారు. పింగ్‌జియాంగ్‌ కౌంటీలోని ఒక మధ్యతరగతి ఇంట్లో నా జీవితం సాగింది. కుటుంబం పేరు ఉపయోగించకుండా విద్యాభ్యాసం పూర్తిచేశా. గ్రాడ్యుయేషను తర్వాత అప్పులు తీర్చేందుకు ఒక మంచి ఉద్యోగం చూసుకోవాలనుకొన్నా. ఆ సమయంలో నాన్న అసలు విషయం చెప్పారు’ అన్నాడు. ఈ రహస్యం బయటపడిన తర్వాతే యుడాంగ్‌ కుటుంబం ఖరీదైన విల్లాలోకి మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని