అసాంజేకు ఊరట

గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేను వెంటనే అమెరికాకు అప్పగించాల్సిన అవసరం లేదని బ్రిటన్‌ కోర్టు స్పష్టం చేసింది.

Published : 27 Mar 2024 04:13 IST

వెంటనే అమెరికాకు పంపేందుకు బ్రిటన్‌ కోర్టు నిరాకరణ

లండన్‌: గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేను వెంటనే అమెరికాకు అప్పగించాల్సిన అవసరం లేదని బ్రిటన్‌ కోర్టు స్పష్టం చేసింది. ఆయనను ఏం చేస్తారనే దానిపై అమెరికా అధికారులు హామీ ఇవ్వనంతవరకూ ఆయన కొత్తగా విజ్ఞాపన చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు విక్టోరియా షార్ప్‌, జెరెమీ జాన్సన్‌ మంగళవారం ప్రకటించారు. కేసు తదుపరి విచారణను మే నెల 20వ తేదీకి వాయిదా వేశారు. దీంతో అసాంజేకు భారీ ఊరట లభించినట్లయింది. దశాబ్దానికిపైగా ఆయన బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అమెరికా అధికారులు హామీ ఇవ్వగలిగితే కేసులో విచారణను పూర్తి చేసి వెంటనే నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు వెల్లడించారు.  ఆస్ట్రేలియాకు చెందిన కంప్యూటర్‌ నిపుణుడైన అసాంజే 2010 నుంచి బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అప్పట్లో ఆయన అమెరికాకు చెందిన వేల క్లాసిఫైడ్‌ డాక్యుమెంట్లను (రహస్య పత్రాలను) వికీలీక్స్‌ పేరుతో బహిరంగపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని