నీరవ్‌ మోదీ ఫ్లాట్‌ అమ్మకానికి బ్రిటన్‌ కోర్టు అనుమతి

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్‌ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది.

Published : 28 Mar 2024 06:16 IST

లండన్‌: బ్రిటన్‌ రాజధాని లండన్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్‌ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. దానిని 5.25 మిలియన్‌ పౌండ్లకు తక్కువకు కాకుండా విక్రయించాలని షరతు విధించింది. న్యాయమూర్తి మాస్టర్‌ జేమ్స్‌ బ్రైట్‌వెల్‌ ఈ కేసును విచారించారు. దీనికి ఆగ్నేయ లండన్‌లోని థేమ్‌సైడ్‌ జైలు నుంచి నీరవ్‌ మోదీ వీడియో ద్వారా హాజరయ్యారు. 103 మారథాన్‌ హౌస్‌ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో ఫ్లాట్‌ను నిర్వహించే ట్రస్టు చెల్లింపులన్నీ పోగా మిగతా సొమ్మును సురక్షిత ఖాతాలో ఉంచుతామన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రతిపాదనలకు న్యాయమూర్తి అంగీకరించారు. ఈ కేసులో ట్రైడెంట్‌ ట్రస్ట్‌ కంపెనీ (సింగపూర్‌)పీటీఈ లిమిటెడ్‌ హక్కుదారుగా ఉంది. సెంట్రల్‌ లండన్‌లోని మేరీలెబోన్‌ ప్రాంతంలో తమకు చెందిన ఆస్తిని విక్రయించేందుకు అనుమతిని కోరింది. అయితే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ట్రస్టు ఆస్తులు సూచిస్తాయంటూ ఈడీ వాదించింది. చివరకు ఫ్లాట్‌ అమ్మకానికి న్యాయమూర్తి అంగీకరించారు. అలాగే నీరవ్‌ మోదీ సోదరి పుర్వీ మోదీ పేరుతో 2017 డిసెంబరులో ట్రస్టు ఏర్పాటుపై ఈడీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని