భూటాన్‌కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్‌

గ్యాల్‌సంగ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్‌కు భారత్‌ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది.

Published : 28 Mar 2024 04:12 IST

థింపు: గ్యాల్‌సంగ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్‌కు భారత్‌ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు భూటాన్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గ్యాల్‌సంగ్‌ ప్రాజెక్టుకు సంబంధించి భారత ప్రభుత్వం మొత్తం రూ.1,500 కోట్లు ఇచ్చేలా ఇరు దేశాల మధ్య ఈ ఏడాది జనవరిలో అవగాహన ఒప్పందం కుదిరింది. తొలివిడతగా జనవరి 28న రూ.500 కోట్లను విడుదల చేసింది. రెండో విడతతో ఈ మొత్తం రూ.వెయ్యి కోట్లకు చేరింది. మరోవైపు ప్రధాని మోదీ ఇటీవల భూటాన్‌లో పర్యటించినప్పుడు ఆ దేశ అభివృద్ధి కోసం వచ్చే అయిదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయమందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని