రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!

సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది.

Published : 28 Mar 2024 04:12 IST

మాస్కో: సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. గత శుక్రవారం జరిగిన ఘోరంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో వ్యక్తి బుధవారం ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు (ఫరీదుని, రచబలిజోడా) ఈ ఏడాది ప్రారంభంలో రష్యాలోనే కొన్నిరోజులు గడిపినట్లు గుర్తించారు. రచబలిజోడా జనవరి 5న, ఫరీదుని ఫిబ్రవరి 20న తుర్కియేలోకి ప్రవేశించారు. వీరిద్దరూ కలిసి మార్చి 2న తుర్కియే నుంచి రష్యాకు బయలుదేరారు. వీరి కదలికలను ఆ దేశ నిఘా విభాగాలు గుర్తించినప్పటికీ, అరెస్టు వారెంట్‌ లేకపోవడం వల్ల అదుపులోకి తీసుకోలేదని వెల్లడైంది. దాడికి ఐఎస్‌ ఉగ్రవాదులే పాల్పడినట్లు తమకు నిఘావర్గాల సమాచారం ఉందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తెలిపారు. దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసన్‌ (ఐసిస్‌-కే) ప్రకటించినా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎందుకు నమ్మడం లేదనేదానిపై పెద్దచర్చ నడుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని