మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో జైశంకర్‌ భేటీ

భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో భేటీ అయ్యారు.

Published : 28 Mar 2024 04:13 IST

కౌలాలంపూర్‌: భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించే దిశగా అన్వర్‌ చేస్తున్న కృషి, ఆయన దార్శనికతను జైశంకర్‌ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. అంతకు ముందు మలేసియా విదేశాంగ మంత్రి మహ్మద్‌ బిన్‌ హజీ హసన్‌తో జైశంకర్‌ సమావేశమయ్యారు. ఇరు దేశాల రాజకీయ, ఆర్థిక, రక్షణ అంశాలతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు చర్చించినట్లు మలేసియా విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మలేసియా- భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలకు దశాబ్దకాలం పూర్తవనుండడంతో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు జైశంకర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని