ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్‌

ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ పేర్కొన్నారు.

Published : 29 Mar 2024 06:34 IST

లండన్‌: ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ పేర్కొన్నారు. ‘ద టైమ్స్‌’ కోసం కన్జర్వేటివ్‌ పార్టీ మాజీ నేత విలియం హేగ్‌కు సునాక్‌ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందించారు. తన కుమార్తెలైన కృష్ణ (12), అనౌష్క (11)లపై దృష్టి సారించడానికి తగినంత సమయం తనకు దొరకడంలేదంటూ ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. ‘‘వాళ్లే నా ప్రపంచం అనుకునే ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. ఓ మంచి తండ్రిగా ఉండటం, సమర్థంగా విధులు నిర్వహించడంలో సమన్వయం సాధించడం చాలా కష్టం’’ అని సునాక్‌ వ్యాఖ్యానించారు. ‘‘ప్రధానిగా విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే అది అత్యంత ముఖ్యమైనది.. యావత్తు దేశం తరఫున కర్తవ్య నిర్వహణ. దీంతో నా కుమార్తెలతో ఓ తండ్రిగా గడపాల్సిన సమయాన్ని కేటాయించలేకపోతున్నా. ఇది పెద్ద సవాలే. పనుల సర్దుబాటు కారణంగా కొన్ని బాంధవ్యాలను కోల్పోతున్నాను. ఇది చాలా కష్టమైనదే. విద్యుక్త ధర్మమంటే అలాగే ఉంటుంది’’ అని సునాక్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని