నాటో దేశాలపై దాడులు చేయం

నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు.

Published : 29 Mar 2024 06:35 IST

ఎఫ్‌-16లనే కూల్చి వేస్తాం: పుతిన్‌

మాస్కో: నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం టోర్జోక్‌ ప్రాంతంలో ఉన్న రష్యా వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అక్కడి పైలట్లతో ముచ్చటించిన ఆయన కొద్దిసేపు సైనిక హెలికాఫ్టర్‌లోని సిమ్యులేటర్‌లో కూర్చుని దాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడారు. ‘1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తర్వాత అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమి రష్యా వైపుగా విస్తరించింది. కానీ నాటో దేశాలపై దూకుడుగా వ్యవహరించాలనే ఆలోచన మాకు లేదు. పోలండ్‌, చెక్‌ రిపబ్లిక్‌లపై రష్యా దాడి చేస్తుందని పశ్చిమ దేశాలు పిచ్చి వాదన చేస్తున్నాయి. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపినా, ఎఫ్‌-16లను ఇచ్చినా వాటిని కూల్చి వేయడం ఖాయం. పొరుగు దేశాల నుంచి రష్యాను లక్ష్యంగా చేసుకున్నా.. అమెరికా కోసం ఆ దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అని పుతిన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని