ఇద్దరి మృతదేహాల వెలికితీత

అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు.

Published : 29 Mar 2024 04:18 IST

అమెరికా వంతెన కూలిన ఘటనలో ముమ్మరంగా సహాయక చర్యలు
వంతెన నిర్మాణానికి 18 నెలల నుంచి 3 సంవత్సరాలు

బాల్టిమోర్‌: అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. వారూ చనిపోయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు మెక్సికో, మరొకరు గ్వాటెమాలాకు చెందినవారు. మరోవైపు వంతెన కూలడంవల్ల సముద్ర, రోడ్డు మార్గాలకు అంతరాయం కలుగుతోంది. దీనివల్ల స్థానికంగా తప్పితే అంతర్జాతీయ రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలగకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే సమీపంలోని ప్రత్యామ్నాయ పోర్టులకు నౌకలను మళ్లించినట్లు వెల్లడించారు. బాల్టిమోర్‌ పోర్టు నుంచి అధికంగా బొగ్గు, కొత్త వాహనాల రవాణా జరుగుతుంటుంది. పోర్టులో 8,000 మంది పని చేస్తున్నారు. పోర్టు కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 నెలల నుంచి 6 నెలలు పట్టవచ్చని అధికారులు తెలిపారు. వంతెనను తిరిగి నిర్మించడానికి 18 నెలల నుంచి 3ఏళ్ల వరకూ పట్టవచ్చని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని