ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ

ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది.

Published : 29 Mar 2024 04:18 IST

తీర్మానాన్ని వీటో చేసిన రష్యా

ఐరాస: ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. 15 సభ్య దేశాల్లో 13 అనుకూలంగా ఓటు వేయగా రష్యా వ్యతిరేకించింది. చైనా హాజరు కాలేదు. దీంతో కమిటీ పర్యవేక్షణ నిలిచిపోనుంది. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై ఆంక్షలు మాత్రం కొనసాగుతాయి. ఉత్తర కొరియా నుంచి ఆయుధాలను తెచ్చుకుంటున్న రష్యా.. దానిని కొనసాగించడానికే తీర్మానాన్ని అడ్డుకుందని మిగిలిన దేశాలు ఆరోపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని