హవాయ్‌లో ఇంధన తొలగింపు పూర్తి

హవాయ్‌లోని భూగర్భ ఇంధన ట్యాంక్‌ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది.

Published : 29 Mar 2024 05:35 IST

హొనొలులు: హవాయ్‌లోని భూగర్భ ఇంధన ట్యాంక్‌ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. 2021లో జెట్‌ ఇంధనం లీకై పెరల్‌ హార్బర్‌ తాగు నీటిలో కలవడంతో 6వేల మంది ఇబ్బందులు పడ్డారు. ట్యాంకుల నుంచి 393.6 మిలియన్‌ లీటర్ల ఇంధనం తొలగింపు ప్రారంభించిన రెడ్‌హిల్‌ జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ అంతకు ముందే రెండో ప్రపంచ యుద్ధంనాటి పైపులైన్లు మళ్లీ లీకవకుండా పలుచోట్ల మరమ్మతులు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని