నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Published : 29 Mar 2024 05:35 IST

ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెనడాకు చెందిన కేబుల్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ మీడియా ఛానల్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజ్జర్‌ హత్య కేసు దర్యాప్తులో భారత్‌ సహకారంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘కెనడా గడ్డపై మన పౌరుడి హత్య జరగడం అత్యంత తీవ్రమైన అంశం. ఇందులో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయి. దీన్ని మేం తేలిగ్గా కొట్టిపారేయలేం. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. ఈ ఘటన ఎలా జరిగిందన్నది మరింత లోతుగా తెలుసుకునే విషయమై.. భారత ప్రభుత్వంతో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు మేం ఎదురుచూస్తున్నాం. మా పౌరులు ఏ అంతర్జాతీయ శక్తుల జోక్యానికీ గురికాకుండా చూసుకోవడం మా కర్తవ్యం’ అంటూ ట్రూడో వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని