మాస్కో సంగీత హాల్‌పై దాడి.. మరో తొమ్మిది మంది అరెస్టు

గత వారం మాస్కోలోని సంగీత కచేరి హాల్‌పై జరిగిన దాడితో సంబంధం ఉందన్న అనుమానంతో శుక్రవారం తొమ్మిది మందిని తజకిస్థాన్‌ జాతీయులను ఆ దేశ స్టేట్‌ సెక్యూరిటీ సర్వీసు అదుపులోకి తీసుకుంది.

Published : 30 Mar 2024 03:52 IST

మాస్కో: గత వారం మాస్కోలోని సంగీత కచేరి హాల్‌పై జరిగిన దాడితో సంబంధం ఉందన్న అనుమానంతో శుక్రవారం తొమ్మిది మందిని తజకిస్థాన్‌ జాతీయులను ఆ దేశ స్టేట్‌ సెక్యూరిటీ సర్వీసు అదుపులోకి తీసుకుంది. ఈ అనుమానితులకు ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌తో సంబంధం ఉందని  తెలుస్తోంది. మాస్కో దాడిలో ఐసిస్‌కు చెందిన ఉగ్రవాదులు 144 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రష్యా భద్రతా సిబ్బంది 11 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. ఇందులో నేరుగా దాడిలో పాల్గొన్న నలుగురు తజకిస్థాన్‌ జాతీయులూ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని