మాల్దీవుల మాజీ అధ్యక్షుడు విదేశీ కీలుబొమ్మ: ముయిజ్జు

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌ సోలిపై ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు విమర్శలు గుప్పించారు.

Published : 30 Mar 2024 05:25 IST

మాలి: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌ సోలిపై ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు విమర్శలు గుప్పించారు. ఆయన ఒక విదేశీ రాయబారి ఆదేశాల మేరకు నడచుకునేవారని గురువారం ఆరోపించారు. ఆ రాయబారి ఏ దేశానికి చెందినవారో ముయిజ్జు పేర్కొనలేదు. సోలి పార్టీ ఎండీపీ భారత్‌ మీద అతిగా ఆధారపడేదని ముయిజ్జు పార్టీ పీఎన్‌సీ పదేపదే ఆరోపిస్తోంది. ముయిజ్జు చైనా మీద ఆతిగా ఆధారపడుతున్నారని ఎండీపీ ప్రత్యారోపణ చేస్తోంది. భారత్‌తో మాల్దీవులకు చిరకాలంగా ఉన్న సత్సంబంధాలను ముయిజ్జు నాశనం చేస్తున్నారని విమర్శిస్తోంది. ముయిజ్జు నిరుడు అధ్యక్షునిగా పదవీ స్వీకారం చేసిన 24 గంటల్లోనే మాల్దీవులలోని భారతీయ సైనిక సిబ్బందిని వెనక్కు వెళ్లిపోవలసిందిగా ఆదేశించారు. జనవరిలో బీజింగ్‌కు వెళ్లిరాగానే నిఘా డ్రోన్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల మొదట్లో తుర్కియే నుంచి నిఘా డ్రోన్లను కొనుగోలు చేసినట్లు మాల్దీవుల ప్రభుత్వం తెలిపింది. మాల్దీవుల చుట్టూ సముద్ర జలాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలంపై ఈ డ్రోన్లు పహరా కాస్తాయని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని