ఉపసంహరించుకున్న సప్లిమెంట్‌లు వాడి.. జపాన్‌లో అయిదుగురి మృతి

జపాన్‌లో కొన్ని ఆరోగ్య సంపూరకాల (హెల్త్‌ సప్లిమెంట్‌లు) వినియోగం వల్ల మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.

Published : 30 Mar 2024 05:25 IST

114 మందికి అస్వస్థత

టోక్యో: జపాన్‌లో కొన్ని ఆరోగ్య సంపూరకాల (హెల్త్‌ సప్లిమెంట్‌లు) వినియోగం వల్ల మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఒసాకాలోని కొబయాషి ఫార్మా సంస్థ ఉత్పత్తి చేసిన కొన్ని సప్లిమెంట్‌లతో ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు పడుతున్నట్లు తేలింది. వాటిని మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ ఈ నెల 22న ప్రకటించింది. అయితే ఆ సప్లిమెంట్‌లను తీసుకున్నవారిలో అయిదుగురు మృత్యువాతపడ్డారని, మరో 114 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ వ్యవహారంపై బాధిత కుటుంబాలకు, ప్రభుత్వానికి కొబయాషి ఫార్మా సంస్థ అధిపతి క్షమాపణలు తెలియజేశారు. సప్లిమెంట్‌లను వినియోగించిన వారిలో అధిక శాతం మంది మూత్రపిండ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మరణాలకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. తమ సంస్థ ఉత్పత్తులతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు కొబయాషి జనవరిలోనే అంతర్గతంగా గుర్తించినా.. ప్రజలను వెంటనే అప్రమత్తం చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని