భారత్‌ సహకారం కోసం ఉక్రెయిన్‌ వినతి

భారత్‌, ఉక్రెయిన్‌ మిత్ర దేశాలనీ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు రెండు దేశాల మధ్యనున్న సహకార బంధాన్ని పునరుద్ధరించుకోవాలని నిశ్చయించాయని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా శుక్రవారం ఉద్ఘాటించారు.

Published : 30 Mar 2024 05:27 IST

దిల్లీ: భారత్‌, ఉక్రెయిన్‌ మిత్ర దేశాలనీ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు రెండు దేశాల మధ్యనున్న సహకార బంధాన్ని పునరుద్ధరించుకోవాలని నిశ్చయించాయని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా శుక్రవారం ఉద్ఘాటించారు. రెండురోజుల భారత పర్యటనకు వచ్చిన కులేబాతో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఇక్కడి హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమయ్యారు ఇరు దేశాలు చిరకాల మిత్రులనీ, యుద్ధాన్ని ముగించి శాంతి సాధించడానికి ఉభయులం చేయవలసిందీ, చేయగలిగిందీ చాలా ఉందని ఈ సందర్భంగా కులేబా పేర్కొన్నారు. జైశంకర్‌, తానూ కలసి శాంతి ఫార్ములా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. పది పాయింట్ల శాంతి ఫార్ములాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 2022లో ప్రతిపాదించారు. జెలెన్‌స్కీ, భారత ప్రధాని మోదీ పలుమార్లు వ్యక్తిగతంగా, ఫోన్‌లో సంప్రదించుకున్నారని కులేబా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు