విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా... ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఒక్క రోజే 99 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.

Published : 30 Mar 2024 05:28 IST

 99 డ్రోన్లు, క్షిపణుల ప్రయోగం

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఒక్క రోజే 99 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. వీటిలో దీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ.. పలుచోట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. గగనతల దాడులతో తమ విద్యుత్‌ సరఫరా వ్యవస్థల్లో తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపింది. దేశంలో అనేకచోట్ల కరెంటు కోతల ముప్పు ఉందని హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటికే పలు నగరాలను నేలమట్టం చేసిన పుతిన్‌ సేనలు.. ఇటీవల వైమానిక దాడులను తగ్గించాయి. అయితే, రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ పాల్పడుతున్న దాడులకు ప్రతిస్పందనగా పుతిన్‌ సేనలు ఎదురు దాడులను పెంచాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బొగ్గు, జల విద్యుత్‌ కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని