ఆగని అమెరికా ఆయుధ సాయం

గాజాలో మానవ సంక్షోభంపై ఇటీవల కాలంలో పదే పదే బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇజ్రాయెల్‌కు మారణాయుధాలను సరఫరా చేయడం మాత్రం ఆపడం లేదు!.

Published : 31 Mar 2024 04:25 IST

ఇజ్రాయెల్‌కు మరో 2,300 బాంబులు
భారీ సంఖ్యలో జెట్‌ విమానాలు

వాషింగ్టన్‌: గాజాలో మానవ సంక్షోభంపై ఇటీవల కాలంలో పదే పదే బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇజ్రాయెల్‌కు మారణాయుధాలను సరఫరా చేయడం మాత్రం ఆపడం లేదు!. తాజాగా భారీ స్థాయిలో బాంబులను, యుద్ధ విమానాలను ఆ దేశానికి అగ్రరాజ్యం బదిలీ చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త ఆయుధ ప్యాకేజీలో శత్రు విధ్వంసకర ఎంకె-84 రకానికి చెందిన 2వేల పౌండ్ల బరువున్న 1800 బాంబులు, ఎంకె-82 రకానికి చెందిన 500 పౌండ్ల బరువున్న 500 బాంబులు ఉన్నాయని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక తెలిపింది. భారీ సంఖ్యలో జెట్‌ విమానాలు కూడా ఉన్నాయి. ఈ ఆయుధ ప్యాకేజీపై వైట్‌హౌస్‌ స్పందించలేదు. వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఏటా ఇజ్రాయెల్‌కు అమెరికా రూ.30 వేల కోట్లకు పైగా ఆయుధాలను సరఫరా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు