లెబనాన్‌లో ఐరాస పరిశీలకులకు గాయాలు

దక్షిణ లెబనాన్‌ సరిహద్దుల్లో ఐక్యరాజ్యసమితికి చెందిన ముగ్గురు సైనిక పరిశీలకులు, ఓ లెబనాన్‌ అనువాదకుడికి గాయాలయ్యాయి.

Published : 31 Mar 2024 04:26 IST

బీరుట్‌: దక్షిణ లెబనాన్‌ సరిహద్దుల్లో ఐక్యరాజ్యసమితికి చెందిన ముగ్గురు సైనిక పరిశీలకులు, ఓ లెబనాన్‌ అనువాదకుడికి గాయాలయ్యాయి. పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో వీరికి సమీపంలో షెల్‌ పేలిందని లెబనాన్‌లోని ఐరాస శాంతి పరిరక్షక దళం తెలిపింది. ఇజ్రాయెల్‌ చేసిన డ్రోన్‌ దాడిలోనే ఈ పరిశీలకులకు గాయాలయ్యాయని స్థానిక లెబనాన్‌ మీడియా పేర్కొనడం గమనార్హం. ఈ కథనాలను ఇజ్రాయెల్‌ ఖండించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని