ముఖ్య సలహాదారులపై జెలెన్‌స్కీ వేటు

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం తన చిరకాల సహచరుడు సెర్హి షెఫీతో పాటు.. కీలక పదవుల్లోని కొందరు ముఖ్యులను తొలగించారు.

Updated : 31 Mar 2024 05:44 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం తన చిరకాల సహచరుడు సెర్హి షెఫీతో పాటు.. కీలక పదవుల్లోని కొందరు ముఖ్యులను తొలగించారు. 2019 నుంచి షెఫీ.. ఫస్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులో పనిచేస్తున్నారు. దీంతో పాటు ముగ్గురు సలహాదారులపైనా జెలెన్‌స్కీ వేటు వేశారు. ఇద్దరు అధ్యక్ష ప్రతినిధులనూ తప్పించారు. ఈ నిర్ణయాలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న విషయంపై ఆయన వివరణ ఇవ్వలేదు. గత కొన్నాళ్లుగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు తన అధికార యంత్రాంగంలో మార్పులు చేస్తున్నారు. తాజా మార్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం నేషనల్‌ సెక్యూరిటీ, డిఫెన్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీగా పనిచేసిన ఒలెక్సీ డానిలోవ్‌ను జెలెన్‌స్కీ తొలగించారు. గత 24 గంటల్లో రష్యా.. 75 వైమానిక దాడులు తూర్పు ఉక్రెయిన్‌పై చేసింది. 38 క్షిపణులు, 98 రాకెట్లు 12 డ్రోన్లను ప్రయోగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని